పులిచింతల ముంపు బాధితులను ఆదుకుంటాం..

160
minister jagadesh reddy
- Advertisement -

పులిచింతల ముంపు గ్రామాల రైతాంగాన్ని ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. రెండు నెలలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటే ఈ సమస్య ఉత్పన్నమైనదని ఆయన పేర్కొన్నారు. పులిచింతల పరివాహక గ్రామలైన వజినేపల్లి,బుగ్గ మాదరం గ్రామాలను గురువారం రాత్రి ఆయన సందర్శించారు. ముంపుకు గురైన పంట పొలాలను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో వరద తాకిడి ఎక్కువైందన్నారు.దానికి తోడు కృష్ణా ఉప్పొంగి ప్రవహించడంతో పులిచింతల ప్రాజెక్ట్ నుండి విడుదల చేసిన నీళ్లు నదిని విస్తరించి పారడంతో పంటపొలాలు ముంపుకు గురి అయ్యాయని ఆయన తెలిపారు.నదిని వెడల్పు చేయాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి తీసుకెడతామని మంత్రి జగదీష్ రెడ్డి రైతాంగానికి హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన భూసేకరణ జరుగాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో ఎదురౌతున్న విద్యుత్ సమస్యను మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుక రాగా శాశ్వత పరిష్కారం కనుగొనాలని విద్యుత్ అధికారులకు అక్కడికక్కడే ఆయన ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,హుజుర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -