కరోనా టెస్ట్ లు చేయడం లేదని ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ పట్టణంలోని కంటైన్ మెంట్ జోన్‌లల్లో పర్యటన చేసి స్ధానిక ప్రజలను పరిస్ధితులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం కేసీఆర్ రేయింబవళ్లు కృషి చేసి..రాష్ట్రంలో కరోనా ను అదుపులోకి తెచ్చారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని..ప్రజలు మరి కొద్ది రోజులు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలన్నారు.
వ్యవసాయ చరిత్రలో తెలంగాణ లో రికార్డ్ స్థాయిలో దిగుబడులు వచ్చాయి… రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులు పండించిన ప్రతి గింజను వారి పొలాల వద్దకే వెళ్లి ప్రభుత్వ మే కొనుగోలు చేస్తుందన్నారు.
కరోనా మహహమ్మరి ప్రభావం వ్యవసాయ ము పై పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని..వచ్చే యాసంగి పంటలకు కూడా రైతుల కు ఎరువులు,విత్తనాలను ముందస్తుగానే అందిస్తున్నామన్నారు. వలస కార్మికులు వారి స్వస్తలాలకు వెళ్తాము అంటే ,వారిని సురక్షితంగా పంపిస్తున్నామని చెప్పారు.