సూర్యపేటలో మొక్కలు నాటిన మంత్రి జగదీశ్ రెడ్డి

253
jagadish reddy
- Advertisement -

6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ ములోని 9 వ వార్డ్ లోని పార్క్ లో మొక్కలు నాటారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈకార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యూగేందర్ రావు, కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, ఎస్పీ ఆర్. భాస్కరన్,మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ళ అన్నపూర్ణ,మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిల్ ర్ లు టి.ఆర్.యస్ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ…ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా హరితహారం లో భాగంగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు.హైదరాబాద్ టూ విజయవాడ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మొక్కలు నాటి స్పూర్తిని నింపారన్నారు. గ్రామపంచాయతీ , మున్సిపాలిటీ చట్టం లో చెట్లను నాటి వాటిని సంరక్షించాలని సీఎం కేసీఆర్ నిబంధనలు పొందుపరిచినట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను బ్రతికించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి జగదీష్ రెడ్డి.

- Advertisement -