గురువారం నల్లగొండలో కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన దీక్ష చేపట్టింది. ఈదీక్షలో మంత్రులు మహమూద్ అలీ,జగదీష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం రైతాంగం,ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మతవిద్వేషాలను రెచ్చగొడుతుందని ధ్వజమెత్తారు. అభివృద్ధిలో పాకిస్తాన్,బంగ్లాదేశ్ కన్నా భారత్‌ను దిగజార్చిన ఘనత మోడీది. దాచుకోవడానికి,దోచుకోవడాకే నోట్ల రద్దు చేశారని మంత్రి దుయ్యబట్టారు. దేశంలో తెలంగాణ తప్పా… అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఉంది. ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని గుర్తు చేశారు.
తెలంగాణ సంక్షేమం చూసి కేంద్రం ఓర్వడం లేదు. దేశం అభివృద్ధి కావాలన్న లక్ష్యం బీజేపీకి లేదు. ప్రజలు ఆఖలితో మాడితేనే వాళ్ళ ఆటలు సాగుతాయనే భావనలో బీజేపీ నేతలున్నారు. దేవుడి పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే వారి టార్గెట్. చట్టప్రకారం వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన ప్రతి గింజనూ కేంద్రం కొనుగోలు చేయాల్సిందే అని మంత్రి తెలిపారు.కేసీఆర్ తన ప్రాణం ఉన్నంత వరకూ…తెలంగాణ రైతులను నష్టపోనియ్యడని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.