‘రామారావు ఆన్ డ్యూటీ’.. ఫస్ట్ సాంగ్‌కు డేట్ ఫిక్స్‌..

75
Ramarao On Duty
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా,సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి పాట ‘బుల్ బుల్ తరంగ్’ని ఏప్రిల్ 10న చిత్ర బృందం విడుదల చేస్తుంది.

రవితేజ, రజిషా విజయన్‌పై చిత్రీకరించిన లవ్లీ సాంగ్ ఇది. ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంటుంది. ఫారిన్ డ్యాన్సర్లతో స్పెయిన్‌లో ఈ పాటని చాలా లావిష్‌గా చిత్రీకరించారు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ, రజిషా జోడి బ్యూటిఫుల్ అండ్ స్టయిలీష్‌గా వుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఫుల్ ప్యాకడ్ యాక్షన్‌తో నిండిన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలని పెంచాయి.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో దివ్యాంశ కౌశిక్‌ మరో హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్‌గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ”రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -