బిజెపి కి ఓటేస్తే ఉచిత కరెంట్ ఊస్టింగేనన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అభంగాపురం లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు భగత్. ఈ సందర్భంగా గులాబీ గూటికి చేరారు మాజీ సర్పంచ్ లక్షమ్మ. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి…జానారెడ్డి కి ఓటు వేస్తే ఒరిగేది ఏముండదన్నారు.
బిజెపి కి ఓటేస్తే ఉచిత కరెంట్ ఊస్టింగ్….మోటర్లకు మీటర్లు వస్తాయన్నారు. డీజిల్,పెట్రోల్, గ్యాస్ ధరలు రెట్టింపు అవుతాయన్నారు. నోముల మరణం దురదృష్టకరం అని…ఇక్కడి ప్రజలు ఐదు ఏండ్లకు అవకాశం ఇచ్చారన్నారు. ఆయన అకాల మరణంతోటే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని….ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బరిలోకి భగత్ నిలిచారన్నారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం….30 ఏండ్ల వరదకాలువను పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. తెలంగాణా వచ్చాకే తెల్లనిదాకా కరెంట్….సంక్షేమ రంగంలో తెలంగాణా టాప్ అన్నారు. ఈ ఎన్నికల ప్రచార సభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి సీనియర్ టి ఆర్ యస్ నేత యం సి కోటిరెడ్డి స్థానిక జడ్ పి టి సి,యం పి పి,సర్పంచ్ ,యం.పి టి సి లు పాల్గొన్నారు.