బ్యాంకర్లను అభినందించిన సీఎస్ సోమేశ్‌ కుమార్…

215
cs somesh
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ మంగళవారం జరిగిన 28 వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బి.ఆర్. కె.ఆర్ భవన్ నుండి పాల్గొన్నారు. కరోనా పరిస్థితులలో కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సహకారం అందించినందుకు బ్యాంకర్లను అభినందించారు.

ఇక ముందు కూడా ఇదే విధంగా సహకరించాలని కోరారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు యూనిట్ వ్యయాన్ని ఎకరానికి రూ.1.20 లక్షలకు పెంచినందుకు బ్యాంకర్లను అభినందించారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ ను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, ఈ పథకానికి సహకరించాలని బ్యాంకర్లను కోరారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులు ఆర్ధికంగా వృద్ది చెందుతారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో స్ట్రీట్ వెండర్స్ పథకము క్రింద 2,74,472 మంది లబ్దిదారులకు రుణ సహాయం పంపిణీ చేయడం ద్వారా తెలంగాణ నెం.1 రాష్ట్రంగా నిలుచుటకు సహకరించిన బ్యాంకర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభినందించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తు దారులకు పంపిణీ చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని బ్యాంకర్లను కోరారు.ధర్డ్ పార్టీ పేరున తనఖా సృష్టించడం, ఆస్తులను మార్ట్ గేజ్ చేయడం వంటి విషయాలతో సహా ధరణి పోర్టల్ అంశాలు త్వరలో పరిష్కరించబడుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు.రాష్ట్రంలో ఎస్టీలను ప్రోత్సహించడంలో అధిక సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం (CMSTEI program) కు సహాకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బ్యాంకర్లను కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, MEPMA మేనేజింగ్ డైరెక్టర్ డా.యన్.సత్యనారాయణ , ఎస్బిఐ చీఫ్ జనరల్ మేనేజర్ మరియు ఎస్ఎల్బిసి ప్రెసిడెంట్ శ్రీ ఓ.పి.మిశ్రా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్ఐడిడి జనరల్ మేనేజర్ శ్రీ సుందరం శంకర్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ వై.కె.రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -