సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షం- మంత్రి

28
Minister Jagadish Reddy

శుక్రవారం సూర్యపేట జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. అన్ని వర్గాలప్రజలు సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ప్రధాని మోదీ దేశాభివృద్ధికి చేసిందేమీ లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ సామాన్య ప్రజల నడ్డి విరిస్తున్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను పిక్కుతింటున్నది. ఇచ్చిన మాట కట్టుబడటంతో దేశంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారినా అన్ని హామీలను అమలు చేస్తున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరిచి సీఎంపై నోటికొచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని మంత్రి సూచించారు. పొద్దున లేస్తే ప్రభుత్వంపై అర్థరహిత, అసత్య ఆరోపణలు చేయడం తప్పా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం వారికి ఏ మాత్రం లేదని ఆయన పేర్కొన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టాభద్రుల ఎమ్మెల్సీగా గడిచిన ఆరేండ్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డి అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేశారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్,గ్రంధాలయ జిల్లా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి Y.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ కిషోర్, DCMS చైర్మన్ జనయ్య యాదవ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్,TRS నాయకులు, నంద్యాల దయాకర్ రెడ్డి,పెద్దిరెడ్డి రాజా,జుట్టుకొండ సత్యనారాయణ,కౌన్సిలర్ లు, MPPలు, ZPTCలు, సర్పంచ్ లు ఇతర నాయకులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.