పట్టభద్రులకు పరిష్కార గొంతుగా ఉంటా- ఎమ్మెల్సీ పల్లా

129
Palla Rajeshwar Reddy
- Advertisement -

నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇవ్వాళ సూర్యాపేట నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్‌తో కలిసి ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాల నాయకులు టీఆర్ఎస్ పార్టీని తూలనాడుతూ అబద్దాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని అన్నారు. కాకతీయుల సృష్టి అయిన 45 వేల గొలుసుకట్టు చెరువులు విధ్వంసం అయితున్నాయి, కట్టలు తెగుతున్నాయి, తూములు, మత్తడులు పొయినయి, నీళ్లు కూడా నింపుకునే పరిస్థితి లేదు, మా చెరువులు బాగు చేసుకోవాలి అని ప్రజలు కోరుకున్నారు అని అన్నారు. 2014కి ముందున్న పరిస్థితి అదైతే, ఇవ్వాళ ప్రతి ఊర్లో ఉన్న చెరువు జలకళతో ఉన్నది అని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం, కొత్త ప్రాజెక్టులు శరవేగంగా చేసుకుంటున్నాం… ప్రతి ఎకరానికి నీళ్లొచ్చినయి… ప్రతి బోర్లో నీళ్లు ఉబికివస్తున్నయి అని అన్నారు.

కోటి ఎకరాలకి రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నం… ఇంకా మిగిలిన 20-30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. బీజేపీ నాయకుల ఇక్కడికొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడ్తున్నరు. ఇవ్వాళ పెద్ద రాష్ట్రాల్లో ఆర్ధిక వృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ ఒచ్చింది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి కాదా.. అప్పులు చేస్తున్నాం అని తప్పుడు, అబద్ధం ప్రచారం చేస్తున్నారు. అప్పుల్లో దేశంలో కింది నుండి నాలుగో స్థానంలో ఉన్నం. లక్షలాది మంది నిరుపేదలని, తక్కువ జీతాలుండే వారిని అదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమే. 24,000 మందిని ఒకటే కలంపొటుతో 20 వేల నుండి 30 వేలకు జీతం పెంచుకుని, పెర్మనెంట్ చేసుకున్నాం అని అన్నారు. ఏ పోలీస్ స్టేషన్లకు వెళ్లిన 2014 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు ఉంటారు..ఒక్క నల్గొండ జిల్లా నుండే 20-25% మంది ఉంటరు. ఎనిమిది నోటిఫుకేషన్లతో 32 వేల ద్వారా 32 వేల మందిని రిక్రూట్ చేసుకున్నాం అని అన్నారు.

లక్ష 30 వేల ఉద్యోగాలు ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 50-60 వేల కొత్త ఉద్యోగాలు ఒస్తున్నాయి. 30 వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంటు వస్తుంది.10 వేలకు పైన ఉద్యోగాలు వస్తాయి అని అన్నారు. మూడు మెడికల్ కాలేజీలు- సూర్యాపేటలో, యాదాద్రిలో, నల్గొండలో ఒచ్చాయి..స్వాతంత్రం ఒచ్చిన తర్వాత ఎవరు తీస్కరాలే.. కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడి మంత్రే తీసుకొచ్చిండు. 14,800 కొత్త కంపెనీలు ఒచ్చినయి, 14.5 లక్షల ఉద్యోగాలు ఒచ్చినయి..నీళ్లిచ్చి, భూమిచ్చి, కరెంట్ ఇచ్చి, భద్రత ఇచ్చిన ఈ ప్రభుత్వానికి చెప్పుకునే హక్కు లేదా.. ఇంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు తేలే అని పల్లా ప్రశ్నించారు. జీడీపీ అంటే మనకేమో గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్… కానీ మోడీ జీడీపీ ఏంటంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధర పెంచడం. మేము ఉద్యోగాలు పెంచినం, మీరు తుంచిన్రు.. మేము రేట్లు పెంచలే, మీరు పెంచిన్రు అని అన్నారు. ఈరోజు ప్రశ్నించే గొంతు అని కొందరు ఒస్తున్నారు.. 6 సంవత్సరాలు కౌన్సిల్లో ప్రశ్నలు వేసిన, పరిష్కార కేంద్రం దగ్గరికి తీసుకపోయిన…పట్టభద్రుల యొక్క పరిష్కార గొంతుగా ఉంటా అని హామీ ఇస్తున్న అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -