పోలీస్ ‌స్టేషన్‌లో సూపర్‌స్టార్..!

23

టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్‌ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దుబాయ్‌కు సంబంధించిన విశేషాలను, అక్కడి ప్రత్యేకతలను మహేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. అయితే మ‌హేష్ తాజాగా దుబాయ్ పోలీస్ స్టేష‌న్‌ను తన ట్విట్టర్‌ ద్వారా చూపించారు.

గురువారం లా మెర్‌లోని దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ (ఎస్పీఎస్) ను సందర్శించారు మ‌హేష్ బాబు. లా మెర్ స్టేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్, ఇది మ‌నుషుల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల‌కు సేవ‌ల‌ను అందిస్తుంటుంది స్టేష‌న్‌ను సంద‌ర్శించిన అనంత‌రం వీడియో విడుద‌ల చేసిన మ‌హేష్ ఈ టెక్నాల‌జీను చూసి మురిసిపోయాను. ఇలాంటిది గ‌తంలో ఎప్పుడు చూడ‌లేదు. ప్ర‌పంచంలోనే ఇది మొద‌టిది. అద్భుత‌మైన అనుభ‌వం అని పేర్కొన్నాడు.