తిరుపతి బరిలో జనసేన.!

60
pawan

తిరుపతి పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తుండగా జనసేన,బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్త సయోధ్యకు రావడం లేదు.

తిరుపతి నుండి ఖచ్చితంగా బరిలో ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తెస్తున్నారు ఆ పార్టీ నేతలు. తిరుపతిలో బీజేపీకి అంత సీన్ లేదని.. బీజేపీకి సీటు కేటాయించి వారికి సహకరించాలంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని వారు పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌కు తేల్చి చెప్పారు జనసేన నేతలు.

తిరుపతిలో బీజేపీకి గెలిచే సీన్‌ లేదని…బీజేపీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహకరించబోమని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే పవన్ ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.