‘అసుర్ 2’ షురూ..

139
Asur 2

2020లో బాలీవుడ్‌ నటుడు బాలీవుడ్‌ అర్షద్ వార్సీ నటించిన ‘అసుర్’ వెబ్ సిరీస్‌ మంచి ఆదరణ పొందింది. వూట్ సెలెక్ట్ ఓటీటీలో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘అసుర్’ వెబ్ సిరీస్‌కి ఇప్పుడు కొనసాగింపుగా ‘అసుర్ 2’ రాబోతోంది. అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఓనీ సేన్ దర్శకత్వం వహిస్తోన్న ‘అసుర్ సీజన్ 2’ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అర్షద్ వార్సీ బాలీవుడ్‌లో సంజయ్ దత్ నటించిన శంకర్ దాదా రెండు భాగాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇతనికి వరుస అవకాశాలు మాత్రం దక్కలేదు. దాంతో అక్కడ క్రేజీ స్టార్‌గా ఎదగలేకపోయాడు. ఇప్పుడు డిజిటల్ రంగంలో అడుగుపెట్టిన అర్షద్ ఇక్కడైనా సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.