బాపు అడుగుజాడల్లో నడవాలి: మంత్రి జగదీశ్ రెడ్డి

95
jagadish reddy

మ‌హాత్ముని అడుగుజాడ‌లో నేటి యువ‌త న‌డ‌వాల‌ని పిలుపునిచ్చారు మంత్రి జగదీశ్‌రెడ్డి. గాంధీజి 151వ జయంతి సందర్భంగా సూర్యాపేటలో జాతిపిత విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించిన జగదీశ్ రెడ్డి…మ‌హాత్ముని అడుగుజాడ‌ల్లో న‌డ‌వ‌డ‌మే గాంధీజీకి మ‌న‌మిచ్చే ఘ‌న‌మైన నివాళి అన్నారు..

అహింసామార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చిన మ‌హోన్న‌త వ్య‌క్తి గాంధీజీ అని…సామాజిక రుగ్మ‌త‌లు లేకుండా దేశాన్ని అభివృద్ధిప‌థంలో న‌డిపేందుకు కృషిచేశార‌ని, సామాజిక మార్పు కోసం నిరంతరం శ్ర‌మించార‌ని చెప్పారు. అందుకే గాంధీజీని ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొలుస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ అన్న‌పూర్ణ‌, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిథులు, టీఆర్ఎస్ పార్టీ నేత‌లు పాల్గొన్నారు.