డోనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్…

226
trump

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.కరోనాతో ఇప్పటివరకు అమెరికాలో లక్షల సంఖ్యలో మృత్యువాతపడగా తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆయ‌న భార్య మిలానియా ట్రంప్‌ల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ట్రంప్‌. వైర‌స్ బారి నుంచి త్వ‌ర‌లోనే విముక్తి చెందుతామ‌ని ట్రంప్ పేర్కొన్నారు. కరోనా లక్షణాలతో టెస్టు చేయించుకున్న ట్రంప్ దంపతులు రిజల్ట్స్‌ రాకుండానే హోం క్వారంటైన్‌లో ఉండారు.

అర్థ‌రాత్రి ఒంటి గంట స‌మ‌యంలో వైట్‌హౌజ్ రిపోర్ట‌ర్ల‌కు ట్రంప్ క‌రోనా రిపోర్ట్‌ను వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నార‌ని,వైట్‌హౌజ్‌లోనే ఉండేందుకు వాళ్లు ఇష్ట‌ప‌డుతున్నార‌ని కాన్లే తెలిపారు. న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ట్రంప్ ప్ర‌చారానికి బ్రేక్ ప‌డినట్లే.