సెల్యూట్ టూ గాంధీజీ: చిరు

32
chiranjeevi

మన జాతి నిర్మాతలను గుర్తుంచుకోవాలన్నారు మెగాస్టార్ చిరంజీవి. శాంతి, సమైక్యత కోసం పాటుప‌డ్డ మ‌హ‌నీయులు మ‌హత్మా గాంధీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిల పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు చిరు.

గాంధీ కేవ‌లం పేరు మాత్ర‌మే కాదు. అందరికి ఆద‌ర్శం, ఒక సిద్ధాంతం. ఆయ‌న పాటించిన స‌త్యం, శాంతి, అహింస సిద్ధాంతాలు ఈ ప్ర‌పంచానికి ఎంతో అవ‌స‌రం అన్నారు. జాతిపిత గాంధీని స్మ‌రించుకుందాం…..ఆయన్ని అనుసరిద్దాం అన్నారు.

జై జ‌వాన్, జైకిసాన్ అనే బ‌ల‌మైన నినాదంతో మ‌నల్ని ఉత్తేజ‌ప‌రిచిన లాల్ బ‌హుదూర్ శాస్త్రి జ‌యంతి ఇవాళే…. ఆయ‌న్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోకూడ‌దు… సెల్యూట్ టు లాల్‌బ‌హుదూర్ శాస్త్రి అని పేర్కొన్నారు.