కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం- జగదీష్ రెడ్డి

209
Minister Jagadish Reddy
- Advertisement -

అయిదు దశాబ్దాల పాపాలకు పరాకాష్టగా వందలాది మంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కిడ్నీ వ్యాధి గ్రస్తులుగా మారారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సురక్షితమైన నీరు అందక పోవడం ఫ్లోరోసిస్ నీళ్లు త్రాగడం వల్లనే డయాలసిస్ బారిన పడ్డారని ఆయన తేల్చిచెప్పారు.అటువంటి వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు గాను డయాలసిస్ కేంద్రాలను అందుబాటులో ఉంచామని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. జైన్ ట్రస్ట్ నిర్వహణలో ఆలేరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలసి ఆదివారం రోజున ప్రారంభించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దెందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలు సత్ఫాలితాలు ఇస్తున్నాయన్నారు. అందులో భాగమే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశాం. దానికి తోడు జిల్లా కేంద్రాలలో ఉన్న ఆసుపత్రుల స్థాయి పెంచడం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామన్నారు. ఆలేరులో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం నిర్వహణకు ముందుకు వచ్చిన జైన్ ట్రస్ట్‌ను మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు.

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వివిధ రూపాలలో స్వచ్చందంగా సేవలు అందిస్తున్న జైన్ ట్రస్ట్ మారుమూల కేంద్రాలలో ఈ తరహా సేవలు అందించేందుకు మొట్టమొదటి సారిగా ముందుకు రావడాన్ని మంత్రి జగదీష్ రెడ్డి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -