టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సాంప్రదాయాలకు పెద్దపీట..

26
Minister jagadish reddy
- Advertisement -

సూర్యాపేట (పిల్లలమర్రి) గ్రామ దేవతల ఆరాధనతో గ్రామాలు సుభిక్షంగా ఉంటున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో యాదవుల ఆరాధ్యదైవమైన గంగ దేవమ్మ పండుగకు ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా పండుగలు చేసుకోవాలన్నారు. అనంతరం సాంప్రదాయ నృత్యాలు చేస్తున్న మహిళలు యువకులతో కాలు కదిపి సందడి చేశారు. బేరీ కొట్టి ఉత్సాహాన్ని నింపారు మంత్రి జగదీష్‌ రెడ్డి.

- Advertisement -