బీజేపీ నేత రెండో రోజు పర్యటనలో వెంట వచ్చిన గుండాలతో రైతుల మీద పాశవికంగా జరిపిన దాడిని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహిళలు,గిరిజనులు,దళితులు అన్న తేడా తెలియకుండా దాడులు చేస్తున్నారు. యాసంగిలో తెలంగాణా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా అని నిలదీసినందుకే బీజేపీ నేతలు ఇంతటి గుండాయిజానికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు.
భూస్వామ్య దాడులను మరిపించే పద్దతిలో బండి సంజయ్ వెంట వచ్చిన గుండాలు జరిపిన దాడులను తిప్పికొట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సూర్యపేట చైతన్యాన్ని మరోమారు చాటిన మహిళా రైతాంగాన్ని ఆయన అభినందించారు. ఇంతకూ తెలంగాణా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందా.. లేదా?.. అని బండి సంజయ్ ని మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.