నిత్యావసర సరుకులు పంపిణీచేసిన మంత్రి జగదీష్ రెడ్డి

242
Jagadish reddy
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో పర్యటించారు మంత్రి జగదీష్ రెడ్డి .చౌటుప్పల్ మండలం లోని 7 వేల మందికి బియ్యం , నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అపత్కాలంలో పేదలకు అండగా ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీ పాలకవర్గానికి , దాతలకు అభినందనలు తెలిపారు. 7 వేల మందికి ఒకే సారి సాయం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

కన్ టైన్ మెంట్ జోన్ లలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో జనజీవనం సాధారణమైందని , ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కారోనపై యుద్ధం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు… ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య ,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, , మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,,మున్సిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు,MPP తాడూరి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -