రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు..

529
Minister Jagadish Reddy
- Advertisement -

సూర్యాపేటలోని సీతారామ ఫంక్షన్ హాల్లో తెలంగాణ సివిల్ సప్లయ్ ఆధ్వర్యంలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఈ సదస్సులో అధికార యంత్రాంగం, రైతు సమన్వయ సమితి సభ్యులు,మిల్లర్లు,సోసైటీ చైర్మన్‌లకు మంత్రి జగదీష్ రెడ్డి సూచనలు చేశారు.

కోదాడ శాసన సభ్యులు, బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ సంజీవ రెడ్డి,డిఆర్డీఏ పిడి కిరణ్ కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రాజాక్,వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యాన్ని తీసుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై ఇప్పటికే ముఖ్యమంత్రి మార్గదర్శకత్వాలు జారీ చేశారు. సీఎం ఆశయాలను అమలు చేసే పద్ధతుల్లో ప్రతీ ఒక్క అధికారి పని చేయాలని మంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి ఇంజినీరింగ్ నైపుణ్యం, నాలుగు సంవత్సరాల కృషి ఫలితంగా గోదావరి జలాల రాకతో సూర్యాపేట జిల్లాలో వచ్చే రబీ నాటికి ఒక్క ఎకరం కూడా ఖాలీగా ఉండే పరిస్థితి లేదు. ఖరీఫ్ అవగాహన సదస్సు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట నియోజవర్గంలో ప్రవహించేది వంద శాతం కాళేశ్వరం జలాలే అన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి.

ప్రస్తుతం సూర్యాపేట నియోజవర్గంలో ప్రవహించేది కాళేశ్వరం జలాలు కాదంటూ కొంత మంది అసత్య ఆరోపణలు చేస్తున్నారు. వారి ఆరోపణలు వారి అజ్ఞానానికి నిదర్శనం. కాళేశ్వరం ద్వారా కాకుండా కేవలం ఎస్సారెస్పీ ద్వారా అయితే పెన్ పహాడ్, నడిగూడెం, మోతే మండలాల్లో వెయ్యి సంవత్సరాలు అయినా నీరు పారించలేము. స్సారెస్పీ ద్వారా వరంగల్ కే సరిగ్గా నీరు రాదు.. ఇక సూర్యాపేట జిల్లాకు ఏమి వస్తాయ్.. గతంలో ఒక్క పంటకు కాదు కదా.. ఒక్క వారం రోజులు కూడా కాలువ ల్లో నీరు వచ్చిన పరిస్థితి లేదన్నారు మంత్రి.

కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఎస్సారెస్పీ కాలువల నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ద్వారా మొట్టమొదట గా నీళ్లు వచ్చేది సూర్యాపేట కే అని ఆనాడే చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈనాడు చెరువులు నింపి తన మాట నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వాల కాలంలో ఏ నాడు కూడా రైతుల కోసం అవగాహన సదస్సు లు పెట్టిన పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులపై ఉన్న ప్రేమ వల్లే ..అవగాహన సదస్సుల నిర్వహణ జరుగుతోంది.

రైతు బీమా వంటి పధకాలపై అధికారులు, రైతు సమన్వయ సభ్యులు రైతులకు అవగాహన కల్పించాలి. గత పాలకుల హయంలో దగా పడిన రైతులు.. టి.ఆర్.ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఆత్మవిశ్వాసంతో పంటను అమ్ముకోగలుగు తున్నారు. రైతుల కోసం ఈసారి జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ లు ఏర్పాటు చేశాం. ఏ సమస్య, ఇబ్బంది వచ్చినా రైతులు టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి చెప్పండి. వెంటనే సమస్య ను పరిష్కరిస్తాం. టోల్ ఫ్రీ నంబర్లు..18004250031967, 9398575246 .

రైతుల వెసులు బాటు కోసం బానుపురి రైతన్న అనే యాప్‌ను కూడా ఏర్పాటు చేయడం అయినది. గ్రేడ్ ఏ రకానికి 1835 , సాధారణ రకానికి 1815 గిట్టు బాటు ధరలు. తేమ శాతం 17 శాతం మించ కూడదు. ప్రభుత్వ భూమి ఉన్న చోట త్వరలో రైతు భవనాలను నిర్మిస్తామని మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -