కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలివే..!

166
election-commission-of-india
- Advertisement -

కరోనావైరస్ వ్యాప్తి నేపధ్యంలో సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం .ఆన్‌లైన్‌లోనే అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలని…ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి సెక్యురిటీ డిపాజిట్ ఆన్ లైన్ లోనే చెల్లించాలని తెలిపింది.

ఇంటింటి ప్రచారానికి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతిచ్చిన ఈసీ….ఓటింగ్ సమయంలో ఓటర్లు ఫేస్ మాస్క్‌లు,చేతి గౌజులు ధరించాలి..ఓటింగ్ సమయంలో ఓటర్లకు ఫేస్ మాస్క్, శానిటైజర్, థర్మల్ స్కానర్లు, గ్లోవ్స్, ఫేస్ షీల్డ్ , పిపిఇ కిట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది.

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సామాజిక దూర ప్రమాణాలను పాటించేలా ఉండనున్న ఏర్పాట్లు…ఓటరు రిజిస్టర్‌లో సంతకం చేయడానికి , ఓటింగ్ కోసం ఈవీఎం బటన్‌ను నొక్కడానికి ఓటర్లకు హ్యాండ్ గ్లోవ్స్ అందించనున్న ఈసి 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు,వైకల్యం కలవారికి, నోటిఫైడ్ ఎసెన్షియల్ సర్వీసులలో పనిచేసే వ్యక్తులు మరియు COVID-19 పాజిటివ్ వ్యక్తులకు,నిర్బంధంలో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. రాజకీయ పార్టీలు వివిధ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారుల సలహాలు సూచనలు ఆధారంగా కొత్త నిబంధనలను రూపొందించింది కేంద్ర ఎన్నికల సంఘం.

- Advertisement -