గిరిజన సహకార సంస్థ ద్వారా గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.
రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(టీఎస్‌జీసీసీ) ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సబ్బుల తయారీ పరిశ్రమను ప్రారంభించారు ఇంద్రకరణ్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పరిశ్రమల స్థాపనతో గిరిజనులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
అటవీ ఉత్పత్తులను సేకరించిడమే కాకుండా గిరిజనులతోనే ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహించి వారి ద్వారానే మార్కెటింగ్ చేయించి వచ్చే ఆదాయాన్ని వారికే చెందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ డా. క్రిష్టినా జెడ్ చోంగ్తు, ఊట్నూరు ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇంచార్జి డీఆర్వో రాథోడ్ రమేష్ పాల్గొన్నారు.