శ్రీలక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల..

155
- Advertisement -

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు, సీఎంవో స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీత తదితరులు పాల్గొన్నారు. కాగా,అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను శుక్రవారం సమర్పించారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కల్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై కల్యాణాన్ని తిలకించారు.

- Advertisement -