త్వరలో నిర్మల్‌ తెలంగాణ భవన్‌ ప్రారంభం:ఐకే రెడ్డి

52
nirmal

త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లాకు విచ్చేయనున్నారని, తెలంగాణ భవన్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి.

నిర్మల్, కొండాపూర్‌లో నిర్మిస్తున్న తెలంగాణ భవన్‌ పనులను పరిశీలించారు. భవన్‌లో మరికొన్ని చెట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశం చూసి విగ్రహం ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. భవన్‌లోని ఆడిటోరియాన్ని పెండ్లిళ్లకు, శుభకార్యాలకు ఇవ్వడం ద్వారా వచ్చే డబ్బును భవన్‌లో పని చేసే వారికి ఉపయోగిస్తామని తెలిపారు.