జిమ్‌లో మహేష్‌ ‘బాక్స్ జంప్స్’.. వీడియో వైరల్‌

128
- Advertisement -

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చూరుగా ఉంటారు. తన ఫ్యామిలీతో గడిపిన క్షణాలను ఎ్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తువుంటారు. తాజాగా మహేష్‌కు సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహేష్‌‌ బాబు తాజాగా జిమ్‌లో వ్యాయామం చేస్తూ వీడియో తీసుకున్నాడు. దీన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. మ‌హేష్‌ బాబు ‘బాక్స్ జంప్స్’ చేస్తూ జిమ్ లో వ్యాయామం చేస్తోన్న తీరు ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయన ఫిట్‌నెస్ ర‌హ‌స్యం ఇదేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మహేశ్‌‌ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయ‌న హెయిర్ స్టైల్ మార్చాడు. మహేస్‌ జిమ్‌లో వర్కౌంట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఈ మూవీలో మ‌హేశ్‌ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, మ‌హేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -