తండ్రి సమాధికి నివాళులు అర్పించిన సిరాజ్…

112
siraj

ఆసీస్‌ టూర్‌ని ఘనంగా ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న ఫాస్ట్ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆసీస్ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సిరాజ్‌కు అపూర్వ స్వాగతం లభించగా స్వస్థలానికి చేరుకున్న సిరాజ్‌ తన తండ్రికి ఘన నివాళి అర్పించారు.

సిరాజ్ ఆసీస్ టూర్‌లో ఉన్న సమయంలో అతడి తండ్రి మరణించగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీసీసీఐ అనుమతిచ్చిన జట్టులో ఒక్కొక్క ఆటగాడు గాయాల పాలు కావడంతో జట్టుతోనే ఉండిపోయాడు. తండ్రి చనిపోయిన బాధను దిగమింగి అద్బుత బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న వెంటనే తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్ అన్న సంగతి తెలిసిందే.

ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు సిరాజ్‌. గబ్బా పిచ్‌పై 6 వికెట్లు పడగొట్టి భారత్‌ విజయం సాధించడంలో కీలకప్రాత పోషించాడు. మొత్తంగా టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధికంగా 13 వికెట్లు తీశాడు. త్వరలో జరిగే ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపికయ్యాడు సిరాజ్‌.