వైల్డ్ డాగ్స్‌ను వదిలిన మంత్రి అల్లోల..

133
- Advertisement -

హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్క్‌లోకి కొత్తగా నాలుగు వైల్డ్ డాగ్స్‌ వచ్చి చేరాయి. గురువారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి వైల్డ్ డాగ్స్‌ను ఎన్ క్లోజర్ లోకి విడుదల చేశారు. అనంతరం మంత్రి పక్షుల ఎవియారీ కాంప్లెక్స్‌, సీసీ కెమెరా సర్విలెన్స్ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలు, సందర్శకుల కోసం కొన్ని ఏర్పాట్లు ప్రారంభించాము. 200 సీసీ కెమెరాలు,ఎవియారీలో అన్ని దేశాల జాతి పక్షులను 1కోటి 50 లక్షలతో ప్రారంభించాం. హైదరాబాద్ జూ పార్క్కు iso 14001 రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

4 వైల్డ్ డాగ్స్ సఫరీ జోన్‌లో ఏసి బస్సెస్ ప్రారంభించాం. ఇతర దేశాల బర్డ్స్ ఎన్నో రకాలు ఉన్నాయి, ఎక్స్చేంజి స్కీంతో ఏర్పాటు చేశాము. గతంలో కరోనా కారణంగా జూ మైంటెనెయన్స్ లో కొంచం ఇబంది వచ్చింది,దానిని పూర్తిగా రినోవేట్ చేపించాము. జూ లోకి నీళ్లు రావడం వలన జంతువులకు హానికలగకుండా కాపాడటంలాంటి కొన్ని అభివృద్ధి పనులు కొనసాగానున్నాయి. పక్షులను గంటలు గంటలు స్పెండ్ చేసి చూడటానికి అన్ని రాష్ట్రాల వారు వస్తున్నారు.

- Advertisement -