బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్‌..

49
indrakaran

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దేవీ శరన్నవరాతి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.

అంతకు ముందు మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులూ పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, ఈవో వినోద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.