తగ్గిన బంగారం ధరలు..

186
hyderabad gold rate

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.780 తగ్గి రూ.50,950కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.390 తగ్గి రూ.46,700కి చేరింది.

ఇక బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ.750 తగ్గి కిలో వెండి ధర రూ.62,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 1919 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరుగుదలతో 25.10 డాలర్లుగా ఉంది.