బాలయ్య నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి

307
srihari
- Advertisement -

నట సింహ నందమూరి బాలకృష్ణ గత కొన్ని సంవత్సరాల కిత్రం స్వీయ దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ద్రౌపది పాత్రను పోషిస్తున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో ప్రాజెక్టు మూలన పడింది.

అయితే అప్పుడు షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఈ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు బాలయ్య తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బాలయ్య లుక్ విడుదల చేయగా తాజాగా దివంగత రియల్ స్టార్ శ్రీహరి లుక్‌ని విడుదల చేశారు.

17 నిమిషాల చిత్రాన్ని ఈ నెల 24న ఎన్బీకే థియేటర్లో శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేయనున్నట్టు బాలయ్య ప్రకటించారు. ఈ చిత్రంలో బాలయ్య అర్జునుడి పాత్రను పోషించగా, ద్రౌపదిగా సౌందర్య, ధర్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి నటించారు.

- Advertisement -