తెలంగాణ దేశానికే ఆదర్శం- మంత్రి అల్లోల

32

రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది. మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్ పర్సన్‌గా పుప్పాల శంకర్, వైస్‌చైర్మన్‌గా గొర్రె గంగాధర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అటవీ, పర్యావరణ శాఖ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ పాల్గొన్నారు. పుప్పాల శంకర్‌కు మంత్రి, ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కృషిచేయాలని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సభ్యులకు మంత్రి సూచించారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో మిషన్‌ కాకతీయ పథకం ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో రైతులు రెండు పంటలు పండిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. వరి ధాన్యం పండిచే రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఎర్ర రఘునందన్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు పాకాల రామ్ చందర్ ,సర్పంచ్ లు ఎంపిపి లు జడ్పిటిసి లు, ఎంపీటీసీ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.