‘రాధే శ్యామ్’ నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్..

122

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌ రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో వరల్డ్ వైడ్ ప్రభాస్ అభిమానుల్లో ఆతృత నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణాష్టమి స్పెషల్ ట్రీట్ ఇస్తూ ‘రాధే శ్యామ్’ నుంచి మరో సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నెమలి పింఛాలతో కూడిన నీలి రంగు గౌనును ధరించిన పూజ.. పియానో వాయిస్తుండగా, జెంటిల్ మ్యాన్ లుక్ లో ప్రభాస్ ఆ వైపు చిరునవ్వులను చిందిస్తూ ఆప్యాయంగా చూస్తున్న ఆ పోస్టర్ క్లాసిక్ గా అనిపిస్తోంది.

ఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేక్షకులు మరచిపోలేని అనుభూతిని థియేటర్ల నుంచి తీసుకెళ్లేలా సినిమాను రూపొందిస్తున్నామని, ఎక్కడా ఎలాంటి చాన్స్ తీసుకోవట్లేదని దర్శకుడు రాధాకృష్ణ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 14న సినిమాను విడుదల చేస్తామన్నారు. 1970ల్లో యూరప్‌లో సాగిన భారతీయ జంట ప్రేమ కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటలీ, జార్జియా, హైదరాబాద్ లలోనే సింహభాగం షూటింగ్‌ను చేశారు. భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ లు సినిమాను నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, టీ సిరీస్‌లు సమర్పకులుగా ఉన్నారు.