సీఎం కేసీఆర్‌ పాలనలో ఆలయాల అభివృద్ధి..

31
minister ik reddy
- Advertisement -

నిర్మల్ పట్టణంను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించే 3 దేవాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు. బంగల్ పెట్ శివారులో రూపాయలు 35 లక్షల తో నూతనంగా నిర్మించే జంగల్ హనుమాన్, 30 లక్షల నిధులతో నిర్మించే ఐదు చేతుల పోచమ్మ ఆలయానికి, సోఫీ నగర్ లో రూపాయలు 25 లక్షలతో నిర్మించే విశ్వకర్మ భగవాన్ ఆలయాలకు ఆయన శంఖుస్థాపన చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో ఆలయాలు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. యాదాద్రి ఆలయాన్ని 1200 కోట్లతో రాతి శిలలతో నిర్మించినట్లు తెలిపారు. గతంలో ఆలయాల నిర్వహణకు రూ.2వేలు మాత్రమే అందేవని, నేడు దూపదీప నైవేద్యం పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.6వేల చొప్పున అందించడంతో పాటు అర్చకులకు వేతనం అందించి గౌరవిస్తున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 10వేల మంది అర్చకులకు జీవనోపాధి ఏర్పడిందని తెలిపారు. నిర్మల్‌లో 500 నుండి 600 ఆలయాలు అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. జంగల్ హనుమన్ ఆలయం పచ్చని చెట్ల ఆవరణలో ఉందని 35 లక్షలతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు.

మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కృష్ణ శిలలతో అద్భుతంగా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సోఫీ నగర్‌లో 25 లక్షలతో విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్యదైవం విశ్వకర్మ భగవాన్ ఆలయాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. నిర్మల్ పట్టణం ఆద్యాత్మిక నగరంగా అభివృద్ధి చెందుతుందని..నంది గుండం దుర్గామాత,గండి రామన్న సాయిబాబా,దేవరకోట,బాలాజీ వాడ వీర హనుమాన్,చింత కుంటవాడ ఆంజనేయ స్వామి,ఇలా పట్టణంలో అన్ని పురాతన ఆలయాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, FSCs చైర్మన్ ధర్మజి రాజేందర్, తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు ముత్యం రెడ్డి, కౌన్సిలర్లు, విశ్వ బ్రహ్మాణ సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.

- Advertisement -