దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట..

30
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే అన్ని గ్రామాల్లో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో రూపాయలు 10 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి పాల్గొని పూజలు చేశారు. అనంతరం గ్రామంలో గల గొర్రెలకు నులిపురుగుల నివారణకై నట్టల మందు వేసారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కి పెద్ద పీట వేస్తుందన్నారు.

ఎల్లపల్లి గ్రామంలో 85 లక్షల తో హనుమాన్ ఆలయాన్ని, ఒడ్డెర కాలనీ హనుమాన్ ఆలయాన్ని 10 లక్షల తో పూర్తి చేసామని తెలిపారు. గ్రామంలో నూతనంగా రెండు భీమన్న ఆలయాలను 40 లక్షల తో, చిన్న భీమన్న ఆలయాన్ని 20 లక్షలతో, 20 లక్షలతో ఐదు చేతుల పోచమ్మ ఆలయాన్ని, నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయానికి 10 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ లక్ష్మి రాంకిషన్ రెడ్డి, పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, ఎంపిపి రామేశ్వర్ రెడ్డి, సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నర్మద ముత్యం రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగ రెడ్డి,నాయకులు కోట గంగాధర్, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -