సూర్యకు కమల్ ఖరీదైన కానుక..

178
surya and kamal
- Advertisement -

తమిళ హీరో సూర్యకు విశ్వనటుడు, సూపర్ స్టార్ కమలహాసన్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్ ను కమల్ కానుకగా ఇచ్చారు. అయితే కమల్ అంతటివాడి నుంచి గిఫ్ట్ అందుకోవడం పట్ల సూర్య ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. రోలెక్స్ వాచ్ బహూకరించినందుకు ‘థాంక్యూ అన్నా’ అంటూ సోషల్ మీడియాలో తన స్పందన వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇవి అందమైన క్షణాలు అని పేర్కొన్నాడు.

అయతే సూర్యకు కమల్ రోలెక్స్ వాచ్ గిఫ్టుగా ఇవ్వడానికి బలమైన కారణమే ఉంది. కమల్ నటించిన విక్రమ్ చిత్రంలో సూర్య అతిథి పాత్ర పోషించారు. ఐదు నిమిషాల పాటు కనిపించే ఈ పాత్ర పేరు రోలెక్స్. విక్రమ్ చిత్రం రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో రోలెక్స్ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అందుకే సూర్యకు కమల్ రోలెక్స్ వాచీని బహూకరించి తన సంతోషాన్ని పంచుకున్నారు. కాగా, కమలహాసన్ నటించిన తాజా చిత్రం విక్రమ్ ఇటీవలే విడుదలై ప్రజాదరణతో దూసుకుపోతుంది.తన చిత్రం విజయం సాధించడం పట్ల కమల్ పొంగిపోతున్నారు.

- Advertisement -