రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆ దిశగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధన్యతనిస్తూ… వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదికను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా కష్ట కాలంలో కూడా రైతులకు వానాకాలం సాగుకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను సకాలంలో అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నర్మదా ముత్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.