ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి- మంత్రి అల్లోల

50

శనివారం సన్ మెడ్ ప్లస్ ఎల్ఎల్ పి ఆధ్వర్యంలో ఎన్- 95 మాస్కులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. సన్ మెడ్ ప్లస్ ఎల్ఎల్‌పి కంపెనీ ఐదు వేల ఎన్- 95 మాస్కులు అందించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. కరోనా వైరస్ అంతమయ్యే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ముఖానికి మాస్కులు ధరించి చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. దశలవారీగా అందరకీ కోవిడ్ టీకాలు వేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి.