ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన కల్పించాలి- మంత్రి కొప్పుల

244
Minister Koppula
- Advertisement -

ఈ రోజు కరీంనగర్ జిల్లా రెవెన్యూ గార్డెన్‌లో రాష్ట్ర స్థాయి ‌ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 ఎదుర్కొంటున్న సవాళ్లు – ప్రతిపై జరిగిన సెమినార్ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంపై చర్చ జరగాలి.. చర్చ ఫలితాలను అనేక ప్రాంతాలకు, వ్యక్తులకు, సమాజంలోకి తీసుకువెళ్లి దీనిపైన ఒక అవగాహన కల్పించాలన్నారు.ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు మొట్టమొదటి సమావేశం కూడా జరుపుకోవడం జరుగుతుంది. వాస్తవంగా ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఒక ముందడుగు వేయకుండా ఒక ప్రయత్నం జరగకుండా ఒక విషయంపైన చర్చ జరగడం కూడా కష్టమే అన్నారు.

ఈ చర్చ కరీంనగర్ వేదికగా తీసుకోవడం చాలా సంతోషం ఒక మంచి ప్రయత్నం అని మంత్రి కొప్పుల తెలిపారు. ఈ చర్చ రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతాలవారీగా జరగాలంటే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన అవగాహన కలిగించాల్సినటువంటి ప్రయత్నం జరగాలన్నారు మంత్రి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హై కోర్టు జడ్జి కేసీ బాను, జెడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే ఆరెపెల్లి మోహన్, మాజీ బార్ అసోసియేషన్ చైర్మన్ కొరివి వేణుగోపాల్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు.

- Advertisement -