- Advertisement -
తన యాస, భాషతో తెలంగాణ ఉద్యమానికి కాళోజీ ఊపిరి పోశారని పేర్కొన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కాళోజీ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఇంద్రకరణ్..ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని తెలిపారు.కాళోజీ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.
భాషను, సాహిత్యాన్ని,రాజకీయాలను, సంఘసంస్కరణలను ఉమ్మడిగా మేళవించి సమసమాజ నిర్మాణం కోసం జీవితాన్ని ధారపోశారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత కవులు, కళాకారులకు, సాహితీ వేత్తలకు గుర్తింపు లభించిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాకవి కాళోజీకి సముచిత గౌరవం కల్పించారని వెల్లడించారు.
- Advertisement -