తెలంగాణలో ఆలయాలకు మహర్దశ: మంత్రి

47

తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. శనివారం ఆయన సొన్ మండలం గంజాల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ఆవిష్కరణ చేసి పూజ కార్యక్రమాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయంలో ఆర్చి, కాంపౌండ్ వాల్‌ను రూ.10 లక్షల నిధులతో నిర్మిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఎంతో అభివృద్ది చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు.