కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి..

38
Errabelli

ఆడబిడ్డ పెళ్లికి అన్నితానైతున్న మహాత్ముడు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, భిన్నత్వంలో ఏకత్వంగా రాష్ట్ర పాలన కొనసాగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం రాత్రి తొర్రుర్ స్థానిక జడ్పీఎస్ ఎస్ హైస్కూల్‌లో.. 2020వ సంవత్సర క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని, క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తుల పంపిణీ, కల్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొదటగా క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి కార్యక్రామాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడబిడ్డ పెండ్లికి పెద్దదిక్కు అవుతూ ఆత్మగౌరవంతో ఆర్థికంగా ఆదుకుంటున్న ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి అని, మతాలకు అతీతంగా, గౌరవిస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, మహిళల సంరక్షణకై ప్రత్యేక చట్టాలను కార్యక్రమాలను చేపట్టి అండగా నిలుస్తూన్నారని మంత్రి తెలిపారు. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, 12వేల కోట్లు వ్యవసాయ పెట్టుబడికి రైతుబంధు ఇస్తూ రైతే రాజు అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా రాష్ట్రానికి మూడు టీఎంసీలను అదనంగా తీసుకెళ్తున్నారని కాళేశ్వరం జలాలను ఆపాలని, కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని, మత ఘర్షణలకు పాల్పడుతున్నారని మంత్రి మండిపడ్డారు.

తొర్రూరు పెద్దవంగర మండలాలు అభివృద్ధిలో గాడిన పడ్డాయని పల్లెల్లో కలుపుకుని మరింత ముందుకు అభివృద్ధి జరిగిందన్నారు. పెళ్లికి ముందు లగ్న పత్రికలు తాసిల్దార్ కి సమర్పిస్తే పెళ్లికి ముందే కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తామని మంత్రి తెలిపారు. మన కష్టం ఉంటే భవిష్యత్తును ఇచ్చిన వారిని అవుతామని, మతాలను గౌరవించాలని అన్నారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తొర్రూర్ మండలం లో 150, పెద్ద వంగర మండలంలో 44 చెక్కులను, క్రిస్టియన్ సోదరులకు తొర్రూర్ మండలంలో 190 పెద్ద వంగర మండలం లో 90 గిఫ్ట్ ప్యాక్లను అందజేసి ముందస్తుగా వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి.