గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి: మంత్రి సత్యవతి

227
Minister Satyavathi Rathod
- Advertisement -

సోమవారం మేడ్చల్ జిల్లా, మల్కాజిగిరిలో రూ.2.15 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, మున్సిపల్ చైర్మన్‌ దీపిక, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనులకు చాలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మైదానం ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు జరిగే విధంగా సీఎం కేసీఆర్ కోరుతానని మంత్రి అన్నారు. గురుకులాల్లో చదువుతున్న పిల్లలు కూడా అనేక ప్రవేశ పరీక్షల్లో తమ సత్తా చాటుతున్నారు. అవకాశం కల్పిస్తే వారు ఎవరికీ తాము తీసిపోమని నిరూపిస్తున్నారని పేర్కొన్నారు.

గిరిజన బాలికలు ఇంటర్ తరవాత విద్య మానేసి పెండ్లిల్లు చేసుకుంటున్నారని, వారి కోసం ఒకేసారి 22 గిరిజన డిగ్రీ గురుకుల విద్యాలయాలు పెట్టారన్నారు. రాజేంద్రనగర్‌లో ఐఏఎస్ స్టడీ సర్కిల్ పెట్టి పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తున్నామన్నారు. నీట్ పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ఇంకా గిరిజనులు అభివృద్ధి చెందడానికి ఏం కావాలన్నా చేయడానికి సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..గిరిజన బాలురకు మంచి వసతి భవనం నా నియోజకవర్గంలో ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు.

- Advertisement -