ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం..

44
AR Rahman

ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని రెహమాన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. కరీమాబేగం అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు రెహమాన్ కు సానుభూతి తెలుపుతున్నారు.

రెహమాన్ తండ్రి, దక్షిణాది సంగీత దర్శకుడు ఆర్కే శేఖర్ చాలాకాలం కిందటే ఈ లోకాన్ని విడిచారు. అనంతరం తల్లి కరీమాబేగం (కస్తూరి శేఖర్)తో కలిసి రెహమాన్ (దిలీప్) ఇస్లాం మతం స్వీకరించి పేర్లు కూడా మార్చుకున్నారు. తల్లితో రెహమాన్ కు అనుబంధం ఎక్కువ. ఈ విషయాన్ని ఆయన అనేక పర్యాయాలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తాను కెరీర్ లో ఎదిగే క్రమంలో ప్రతి కీలక ఘట్టంలో తల్లి నిర్ణయాలు, మద్దతు ఉన్నాయని వెల్లడించారు.