విద్య,వైద్యం,వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాముఖ్యత- మంత్రి

207
Sabitha Indra Reddy
- Advertisement -

వికారాబాద్ జిల్లా కేంద్రంలో కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్న నూతన రీడింగ్ రూమ్ నిర్మాణ పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే లు మెతుకు ఆనంద్,కాలే యాదయ్య,నరేందర్ రెడ్డి,మహేష్ రెడ్డి,రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ శ్రీధర్,విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్,రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ రమణ కుమార్,జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య,మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల,డిఈఓ రేణుక,లైబ్రరీ కార్యదర్శి హరిశంకర్,వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మండలంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించటం జరిగింది. ఆధునిక హంగులతో ,అన్ని సౌకర్యాలతో నూతన రీడింగ్ హాల్ నిర్మాణం చేపట్లాలి. అది త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆధునిక హంగులతో నూతన గ్రంథాలయ భవనాలు నిర్మించాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే వికారాబాద్‌లో జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉండటంతో ఈ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత తెలుస్తుంది. చదువుల తల్లి సరస్వతి నిలయం వికారాబాద్ అని మంత్రి అన్నారు. విద్యా హబ్ గా ఉన్న వికారాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వికారాబాద్‌లో స్టడీ సెంటర్ ఏర్పాటు కు కృషి చేస్తామన్నారు. కరోనా ఇబ్బందులు ఉండటంతో రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులను పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేయటం జరిగింది. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం అయిన రాష్ట్రలలో పరిస్థితులు పరిశీలిస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు చేశారు. వికారాబాద్, తాండూరు,పరిగి, చేవెళ్ల,కొడంగల్ నియోజకవర్గలలో పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాల ఎంపిక చేస్తున్నాము. జిల్లాలో పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం విద్య,వైద్యం,వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తుంది. విద్యాశాఖలో ఉన్న భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి సబితారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

- Advertisement -