జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల..

72
jee

జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ రిలీజైంది. 4 విడతల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జేఈఈ మెయిన్స్ మొదటి పరీక్ష జరగనుండగా మార్చి 2న రెండో పరీక్ష,ఏప్రిల్ 3న మూడో పరీక్ష,మే 4న నాలుగో పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ మార్చి 6న రానున్నాయి.

జేసీసీ(జాయింట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్ 2021 రిజిస్ట్రేషన్లు మంగళవారం(డిసెంబర్ 15) నుంచి ప్రారంభమయ్యాయి. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2021లో జరిగే జేఈఈ పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

డిసెంబర్ 15న ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ 2021 దరఖాస్తుల ప్రక్రియ తుది గడువు జనవరి 15, 2021తో ముగియనుంది.