అనాధ పిల్లలకు మంత్రి కొప్పుల‌ ఆపన్న హస్తం..

36
Minister Koppula

అనాధ పిల్లలకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆపన్న హస్తం అందించారు. ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మామిడాల శ్రీకాంత్(21),మామిడాల శీరిష(18)లు, నిలువనీడ లేక అనారోగ్యంతో బాధపడుతున్న వృద్దురాలైన వాళ్ల మేనత్త వద్ద జీవిస్తున్నారు. వారి దీన స్థితిని తెలుసుకోని మంత్రి వారికి ప్రభుత్వం నుంచి నివాస స్థలం(125 గజాలు)మంజూరు చేయించి, స్వంత ఖర్చులతో ఎంఎల్‌ కొప్పుల ట్రస్ట్ ద్వారా నూతన ఇంటి నిర్మించి ఇచ్చారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతులమీదుగా వారి గృహ ప్రవేశం చేయటం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పిల్లల కళను సాకారం చేసిన మంత్రికి మరియు ట్రస్ట్ ఛైర్ పర్సన్ కొప్పుల స్నేహలతకు శ్రీకాంత్, శీరిషలు మరియు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.