కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం: హరీశ్‌ రావు

178
harish
- Advertisement -

కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, కోటి ఎకరాలు సాగవుతోందన్నారు మంత్రి హరీశ్ రావు. గురువారం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గ భవానీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.

కోటి ఎకరాలు సాగు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రపుటల్లోకి ఎక్కిందన్నారు. సీఎం కేసీఆర్‌ కృషితో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.జాతర కోసం సింగూరు నుంచి 0.35 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పోతంశెట్టిపల్లి నుంచి రూ.36కోట్లతో వంద ఫీట్ల రోడ్డును నిర్మించనున్నట్లు చెప్పారు.ఏడుపాయలలో పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌, ఏటీఎంలను ఏర్పాటు చేశామని, రూర్బన్ పథకం నుంచి ఏడుపాయల్లో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

- Advertisement -