సింగూరు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి హరీశ్‌ రావు..

106
harishrao

సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టును సందర్శించారు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి ప్రాజెక్టును సందర్శించిన హరీశ్‌…ప్రాజెక్టు నిండుకుండను తలపించడంతో గంగమ్మాకు ప్రత్యేక పూజలు చేశారు.ఇన్ ఫ్లో వివరాలను ప్రాజెక్టు అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు హరీష్ రావు.

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీ కాగా.. ప్రస్తుతం 28 టీఎంసీలకు చేరింది. ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నీటి విడుదలతో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.