దేశంలో 24 గంటల్లో 67,708 కరోనా కేసులు

193
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 73 లక్షలు దాటాయి.

గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 67,708 పాజిటివ్ కేసులు నమోదుకాగా 680 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బాధితుల సంఖ్య 73,07,098కి చేరగా ప్రస్తుతం దేశంలో 8,12,390 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా నుండి 63,83,442 మంది బాధితులు కోలుకోగా ఇప్పటివరకు 1,11,266 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు 9,12,26,305 కరోనా టెస్టులు చేయగా 24 గంటల్లో 11,36,183 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని ఐసీఎంఆర్ వెల్ల‌డించింది.