మొక్కలు నాటిన ప్రముఖ డాక్టర్ మార్కండేయులు..

182
green challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం జన్మదినం రోజున మొక్కలు నాటడానికి వేదిక అవుతుంది. ప్రముఖ డాక్టర్ మార్కండేయులు తన 46వ జన్మదినం సందర్భంగా 46 మొక్కలను చిలుకూరులో నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా హంగు ఆర్భాటాలు లేకుండా సమాజానికి ఉపయోగపడే ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు నా 46వ జన్మదినం పురస్కరించుకొని 46 మొక్కలను నాటడం జరిగిందన్నారు.

అదేవిధంగా ఎల్బీనగర్ ప్రాంతంలో నాలుగు వందల మొక్కలను రెండు దేవాలయాల్లో భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.